మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం సురేష్ రెడ్డి.. కాంగ్రెస్ ని వీడి.. కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అలా పార్టీ మారారో లేదో..అనుకోని షాక్ ఒకటి తగిలింది. అది కూడా ఆయన మద్దతుదారుల నుంచే.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సురేష్ రెడ్డి ఎన్నో సంవత్సరాలుగా  కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఆయన రాష్ట్ర  అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆయన మద్దతుదారులు మాత్రం తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని చెప్పడం కొసమెరుపు.

సాధారణంగా ఎవరైనా నేత పార్టీ మారుతున్నారంటే.. ఆయన మద్దతు దారులు కూడా ఆయన వెంటే వెళ్లిపోతారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తమ నాయకుడు పార్టీ మారినా.. మేము మాత్రం మారమూ అని అధికారికంగా ప్రకటించారు. వారి ప్రకటనతో సురేష్ రెడ్డితోపాటు.. టీఆర్ఎస్ నేతలకు కూడా దిమ్మ తిరిగిపోయింది.