Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు మ‌రో షాక్.. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లోకి కీల‌క నేత‌లు

Medak: కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప‌లువురు నేత‌లు అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మెద‌క్ జిల్లాకు చెందిన ప‌ల‌వురు కాంగ్రెస్ నాయ‌కులు కారెక్కారు.
 

Shock for Congress in Medak, Key leaders join BRS in presence of Minister KTR RMA
Author
First Published Oct 6, 2023, 11:21 PM IST

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప‌లువురు నేత‌లు అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మెద‌క్ జిల్లాకు చెందిన ప‌ల‌వురు కాంగ్రెస్ నాయ‌కులు కారెక్కారు.

వివ‌రాల్లోకెళ్తే.. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మెదక్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ కే తిరుపతిరెడ్డి భార‌త రాష్ట్ర స‌మితిలో చేరారు. బీఆర్ఎస్ వ‌ర్కింట్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో ఆయ‌న‌తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా కే తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేశాన‌నీ, అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. 

నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకి మాత్రమే టికెట్లు ఇస్తున్న‌ద‌ని ఆరోపించారు. డబ్బు సంచులతో వచ్చిన వాళ్లకు టికెట్లను అమ్ముకుంటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందుకే ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు బీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్టు తెలిపారు. మెదక్ జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నేడు బీఆర్ఎస్ ఓల చేరుతున్నార‌ని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామ‌ని చెప్పారు. ఇంటి ఇంటికి గడపగడపకు తిరిగి ఉమ్మడి మెదక్ జిల్లాలోని అత్యధిక మెజార్టీతో మెదక్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తామ‌న్నారు.

అలాగే, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితిలోకి తన క్యాడర్ తో పాటు వస్తున్న తిరుపతి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం ప‌లికారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను బలవంతంగా బయటకి పంపించిందన్నారు. కానీ భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చి పార్టీలో జాయిన్ అవడం స్వాగతించదగిన విషయమ‌ని పేర్కొన్నారు. తిరుపతి రెడ్డి తో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పార్టీ కాపాడుకుంటుందనీ, వారికి సముచిత గౌరవాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios