హైదరాబాద్: పోలీసుల కాల్పుల్లో హతమైన గ్యాంగస్టర్ నయీం కుడిభుజం శేషన్న ఆచూకీని తెలంగాణ పోలీసులు కనిపెట్టినట్లు తెలుస్తోంది. నయీం హతమైనప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. కానీ అతని ఆచూకీ లభించలేదు.

తాజాగా పోలీసులు శేషన్న ఆచూకీని కనిపెట్టినట్లు తెలుస్తోంది. గత రెండున్నరేళ్లుగా అతను అజ్ఞాతంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో అత్యంత సన్నిహితుడైన మిత్రుడి వద్ద అతను తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అతన్ని పట్టుకునే పనిలో తెలంగాణ పోలీసులు ఉన్నారు. అతని వద్ద భారీగా డంప్ ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. అతనిది మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట.

నయీంకు సంబంధించిన పలు దందాల్లో, సెటిల్ మెంట్ వ్యవహారాల్లో శేషన్న కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. అతను పట్టుబడితే నయీం ముఠాకు సంబంధించిన కీలకమైన వివరాలు లభ్యమయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్త

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు ఎంతో తెలుసా...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.....