హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులను ఓ కొలిక్కి తెచ్చింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ. నయీం మరణాంతరం ఆయన ఆస్తులపై దర్యాప్తు చేసిన సిట్ బృందం ఆయన ఆస్తుల విలువ అక్షరాలా 2 వేల కోట్లు‌గా తేల్చింది. 

నయీం పేరిట మొత్తం 1019 ఎకరాల వ్యవసాయ భూమి, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఈ ఆస్తులన్నీ కోర్టు అధీనంలో ఉన్నట్లు స్పష్టం చేసింది. 

ఇక కేసుల విషయానికి వస్తే నయీమ్‌పై మొత్తం 251 కేసులు నమోదయినట్లు తెలిపారు. వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తైనట్లు తెలిపింది. మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది రెండు మూడు నెలల్లో కేసు విచారణ పూర్తి చేస్తామని సిట్ బృందం స్పష్టం చేసింది.