Asianet News TeluguAsianet News Telugu

‘షీ’ ఈజ్ పర్ఫెక్ట్

  • వేధింపుల నుంచి మహిళలకు భరోసా
  • రెండేళ్లు పూర్తి చేసుకున్న షీ  టీమ్
  • జంటనగరాల్లో 20 శాతం తగ్గిన కేసులు
she teams

 

‘ఆమె’కు అండగా ఉంటూ హైదరాబాద్ ను సేఫ్ సిటీగా మార్చడంలో షీ టీమ్ మంచి ప్రొగెస్ తో ముందుకెళ్తోంది. పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ దేశంలో అత్యంత భద్రమైన సిటీగా హైదరాబాద్ ను  నిలపడంలో తనవంతు పాత్ర పోషిస్తొంది.

రెండేళ్ల కిందట మహిళపై వేధింపులను అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం షీ టీమ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది.  అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ఆధ్వర్యంలో మొదలైన షీ టీమ్.. అత్యాధునిక సాంకేతిక పరిజానం ఉపయోగించి పోకీరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పాటు వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చి మార్పు తెచ్చే ప్రయత్నమూ తెస్తోంది.

 

మైనర్ల నుంచి ముసలివాళ్ల వరకు....

మహిళలను వేధించేది ఎక్కువగా కుర్రకారే అనుకుంటే పొరపడినట్టే... ఎందుకంటే షీ టీమ్ ఇప్పటివరకు 2362 ఫిర్యాదులు అందగా 800 మందిగా పైగా అరెస్టు చేశారు. ఇందులో 12 ఏళ్ల మైనర్ల నుంచి 70 ఏళ్ల వాళ్లు కూడా ఉండడం విశేషం.

మైనర్లు 200 మంది దాకా ఉంటే 50 ఏళ్లు దాటిని వాళ్లు 170 మంది ఉన్నారు. అయితే షీ టీమ్ పట్టబడిన వారు మైనర్లు అయితే వాళ్లపై కేసులు నమోదు చేయకుండా వారి తల్లదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

ఇలా క్యాచ్ చేస్తారు..

సిటీలోని రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో ఉండే షీ టీమ్ సభ్యులు ఎవరైనా అక్కడ మహిళను వేధింపులకు గురిచేస్తే తమ దగ్గర ఉన్న రహస్య కెమోరా ద్వారా చిత్రీకరిస్తారు. ఇలా బలమైన సాక్షాదారాలతో పక్కా వ్యూహంతో నేరాల అదుపులో షీటీమ్ ముందుకు వెళుతోంది. ఆపదలో ఉన్న మహిళలు షీటీమ్కు ఫోన్, వాట్సప్, ఫేస్బుక్ లో సంప్రదించినా చాలు వాటినే ఫిర్యాదుగా తీసుకొని చర్య తీసుకుంటారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో చాలా మంది ముందుకు వస్తున్నారు.

సర్వేలో నెంబర్ 2గా తెలంగాణ...

గత సంవత్సరం సెంటర్ ఫర్ స్ర్టాటజిక్ ఇంటర్ నేషనల్ స్టడీస్ అనే సంస్థ దేశంలో వివిధ రాష్ట్రాలలో నిర్వహించిన సర్వేలో మహిళా భద్రతలో సిక్కింకు మొదటి స్థానం రాగా రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో వేధింపుల కేసులు, మహిళ బధ్రత, ప్రజల అభిప్రాయాన్ని పరిగణననలోకి తీసుకొని చేసిన  ఈ సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో ఉండడంలో షీం టీమ్ కషి ఎంతో ఉందని చెప్పొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios