Asianet News TeluguAsianet News Telugu

18వ రోజుకు చేరుకున్న షర్మిలక్క ప్రజాప్రస్థానం పాదయాత్ర (వీడియో)

పద్దెనిమిదో రోజు దామెర క్రాస్, మర్రిగూడ మండలం, మునుగోడు నియోజకవర్గంలోకి ప్రవేశంచిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో అభిమానులు, స్థానికులు, YSRTP నాయకులు, కార్యకర్తల వెనకరాగా షర్మిల ముందునడిచారు. 

Sharmilakka 18th day Prajaprasthanam Padayatra
Author
Hyderabad, First Published Nov 6, 2021, 1:18 PM IST

తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. చేవెళ్లలో ప్రారంభమైన YS Sharmila పాదయాత్ర అక్టోబర్ 6న 18వ రోజుకు చేరుకుంది. శనివారం నాడు మర్రిగూడ మండలం, మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. 

"

పద్దెనిమిదో రోజు దామెర క్రాస్, మర్రిగూడ మండలం, మునుగోడు నియోజకవర్గంలోకి ప్రవేశంచిన ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో అభిమానులు, స్థానికులు, YSRTP నాయకులు, కార్యకర్తల వెనకరాగా షర్మిల ముందునడిచారు. 

జోహార్ YSR, జై షర్మిలమ్మ అంటూ నినాదాల హోరుతో పాదయాత్ర సాగుతోంది. చిన్నపిల్లలు పెద్దలు వైఎస్ షర్మిలతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. దారి మధ్యలో అయ్యప్ప భక్తులతో ముచ్చటించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఇక షర్మిలక్క 18వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర భారీ జనసందోహంతో సాగుతోంది. 

11వ రోజుకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర..

ఇదిలా ఉండగా, పాదయాత్రలో భాగంగా మధ్యమధ్యలో సభలతో ముందుకు సాగుతున్న YSR తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. Telangana రాష్ట్ర ప్రభుత్వంపై  విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతున్నదని విమర్శలు చేశారు. 

రెండు సార్లు కేసీఆర్‌ను గెలిపిస్తే ఏం చేశాడని అడిగారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని గతనెల చివర్లో జరిగిన మాటముచ్చట కార్యక్రమంలో YS Sharmila ప్రజలను కోరారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా దున్నపోతు మీద వాన పడుతున్నట్లే KCRలో చలనం లేదని విమర్శించారు.

ఇంకా ఒక అన్న మాట్లాడాడని, కండ్లలో నుంచి కన్నీళ్లకు బదులు రక్తం వస్తున్నదని ఆవేదన చెందాడని వైఎస్ షర్మిల అన్నారు. వాస్తవంలో ప్రజల పరిస్థితి ఇలా ఉంటే TRS ప్రభుత్వం మాత్రం ప్రజలు ఇబ్బందులే లేవని వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇల్లు అంటూ టీఆర్ఎస్ గొప్పలు పోతున్నదని, అవి ఎవరికైనా వచ్చాయా? అని అడిగారు.

పింఛన్లు కూడా రావడం లేదని, పింఛన్ లిస్టులో ఉన్నవాళ్లు బతికినంత కాలం రానేలేదని, ఆ లిస్టులో ఉండే వారు మరణిస్తున్నారనీ, కానీ, పింఛన్ మాత్రం రావడం లేదని ఆరోపణలు చేశారు. యువతనే కాదు, కేసీఆర్ ముసలివాళ్లనూ మోసం చేశాడని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వృద్ధులు పింఛన్ రాక అవస్తలు పడుతున్నారని తెలిపారు.

విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, డిగ్రీ, పీజీలు చేసి టీ, టిఫిన్ సెంటర్లు, కూరగాయలు అమ్ముకుంటూ బతుకీడుస్తున్నారని షర్మిల అన్నారు. మరెంతో మంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగలేవని చెప్పారు. ఇంత జరుగుతన్న దున్నపోతు మీద వాటన పడినట్లే.. కేసీఆర్‌లో చలనం లేదని విమర్శించారు.

వైఎస్ఆర్ పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని, డ్వాక్రా మహిళలకు నేటి ప్రభుత్వం ఇస్తున్న రుణాలపై రూపాయి పావలా పడుతున్నదని వైఎస్ షర్మిల అన్నారు. అవి ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయని తెలిపారు. తెలంగాణలో నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌తో మేలు జరిగింది ఎవరికి? అని ప్రశ్నించారు. 20 ఎకరాలు భూమి ఉంటే 15 ఎకరాలే చూపెడుతున్నదని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios