Asianet News TeluguAsianet News Telugu

షర్మిలకే తెలంగాణా సారధ్యం ?

   ఖమ్మం పార్లమెుంట్ స్ధానం నుండి షర్మిల గనుక పోటీ చేస్తే గెలుపు ఖాయమని నమ్మకంతో చెప్పినట్లు సమాచారం.

sharmila

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున తెలంగాణాలో ప్రధాన ఆకర్షణగా వైఎస్ షర్మిలే నిలువనున్నారా? సారధ్య బాధ్యతలు పూర్తిగా షర్మిల భుజస్కందాలపై మొపటానికి జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చాపక్రింద నీరులా సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పోయిన ఎన్నికల్లో ఏపిలో బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణాలో తెలంగాణా రాష్ట్ర సమతి అధ్యక్షుడు కెసిఆర్ కు మధ్య రహస్య ఒప్పందాలన్నట్లుగా టిడిపి ఏపిలో అప్పట్లో బాగా ప్రచారం చేసింది. ఆ ప్రచారం వైసీపీపై నెగిటివ్ ప్రభావం చూపింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్ వచ్చే ఎన్నికల సారధ్య బాధ్యతలను సోదరి షర్మిలకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

  షర్మిల కూడా గతంలో పార్టీ కోసం తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. పోయిన ఎన్నికల్లో కొందరు అభ్యర్ధుల తరపున ప్రచారం కూడా చేసారు.

షర్మిలకు తెలంగాణా కొత్తేమీ కాదు. కాకపోతే గతంలో షర్మిల జరిపిన ప్రచారం, పాదయాత్రలు మొత్తం జగన్ కనుసన్నల్లోనే జరిగింది. రాబోయే రోజుల్లో షర్మిల చేపట్టబోయే కార్యక్రమాలు మొత్తం ఆమె ఆలోచనల ప్రకారమే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

 

sharmila

వైఎస్ కుంటుంబం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఎన్నికల్లలో షర్మిల పార్లమెంట్ కు పోటీ చేయటం కూడా ఖాయంగా తెలుస్తోంది. అది కూడా ఖమ్మం పార్లమెంట్ స్ధానం అత్యంత భద్రమైనదిగా జగన్ కుటుంబం ఎంచుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఇటీవలే జగన్, షర్మిలకు ఖమ్మం జిల్లా నేతలకు మధ్య చర్చలు కూడా జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖమ్మం పార్లమెంట్ చిరిత్ర గమనిస్తే ఎంపిగా గెలిచిన వారిలో జిల్లాతో సంబంధం లేని వ్యక్తులే ఎక్కువమంది కనిపిస్తారు. నాదెండ్ల భాస్కర రావు, రంగయ్యనాయడు, రేణుకాచౌధరి తదితరులు చాలామందే ఉన్నారు.

 

  ఇదే విషయాన్ని ఖమ్మం జిల్లా నేతలు జగన్ వద్ద ప్రస్తావించి షర్మిల గనుక పోటీ చేస్తే గెలుపు ఖాయమని నమ్మకంతో చెప్పినట్లు సమాచారం. పైగా ఖమ్మంలో టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతోందని, టిడిపి దాదాపు కనుమరుగైనట్లు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో మిగిలింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని కూడా సూ చించినట్లు సమాచారం.

 

   పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఎన్నికల్లో తెలంగాణా వ్యాప్తంగా వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య  పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే షర్మిల ఖమ్మంలో పోటీ చేయటంతో పాటు తెలంగాణా వ్యాప్తంగా అభ్యర్ధుల ఎంపిక, వారి ప్రచార బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. పార్టీ సారధ్య బాధ్యతలు షర్మిలకు అప్పగించే విషయాన్ని మంచి సమయం చూసుకుని జగన్ ప్రకటన చేస్తారని తెలిసింది. తెలంగాణా సారధ్య బాధ్యతలు పూర్తిగా షర్మిలకు అప్పగించనున్న నేపధ్యంలో జగన్ పూర్తి దృష్టి ఏపి రాజకీయాలపైనే పెట్టేందుకు వెసులుబాటు వస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios