బాలీవుడ్ కింగ్ ఖాన్ గా వెండితెరను ఏలుతున్న షారుక్ ఖాన్ ఒకప్పుడు టోలీచౌకీ వీధుల్లో చక్కర్లు కొట్టిన మన కుర్రవాడే. తన కొత్త చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన షారుఖ్ తెలంగాణ పై ఏమన్నారంటే...
బాలీవుడ్ కింగ్ ఖాన్ గా వెండితెరను ఏలుతున్న షారుక్ ఖాన్ ఒకప్పడు టోలీచౌకీ వీధుల్లో చక్కర్లు కొట్టిన మన కుర్రవాడే. తన కొత్త చిత్రం రాయిస్ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన షారుఖ్ తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసలు కురిపించారు. నగరంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ప్రజలది కష్టించి పనిచేసే తత్వమని కొనియాడారు. హైదరాబాద్‌కు రావడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ మౌలిక సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయని అభిప్రాయపడ్డారు.
