శంషాబాద్ ఫామ్ హౌస్ లో అశ్లీల డ్యాన్స్ లు

First Published 14, Dec 2017, 2:48 PM IST
shamshabad farm house birthday bash lands ends in mess
Highlights
  • వెరైటీ బర్త్ డే జరుపుకోవాలని ఆరాటం
  • కటకటాలపాలైన హైదరాబాదీ

శంషాబాద్ ప్రాంతం హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతం. శంషాబాద్ లోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ లు నెలకొన్నాయి. అసాంఘిక కార్యకలాపాలు కూడా బాగానే జరుగుతుంటాయి. అయితే అవన్నీ గుట్టుగా సాగితే ఎవరికీ తెలిసే చాన్స్ లేదు. కానీ ఒక సంఘటన వెలుగులోకి వచ్చి రచ్చ రచ్చ అయింది. శంషాబాద్ పోలీసులు, స్థానిక ప్రజలు చెప్పిన ఆ వివరాలు చదవండి.

హైదరాబాద్ లోని పర్వేజ్ అనే వ్యక్తి చిరు వ్యాపారి. ఆయన తన జన్మదిన వేడుకలు వెరైటీగా జరుపుకోవాలని భావించాడు. మహిళా డ్యాన్సర్లతో వెస్ట్రన్ సాంగ్స్ కు డ్యాన్స్ చేయిస్తూ ఎంజాయ్ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా శంషాబాద్ మామిడిపల్లిలోని ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాడు. బర్త్ డే వేడుకల కోసం పాత హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సలీం, షోహబ్ ముక్రమ్తోపాటు మరో ఐదుగురు స్నేహితులంతా మంగళవారం రాత్రి మామిడిపల్లిలోని పామ్ హౌస్ కు చేరుకున్నారు. అందరూ ఫుల్ గా మదు తాగారు.

అదే సమయంలో మైలార్ దేవ్ పల్లికి చెందిన ఆటో డ్రైవర్ హజ్జు తన ఆటోలో మొఘల్ పురా నుంచి ముగ్గురు లేడీ డ్యాన్సర్లను ఫామ్ హౌస్ కు తీసుకొచ్చాడు. ఇక తాగిన మత్తులో ఉన్న పర్వేజ్ అతడి స్నేహితులు లేడీ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఎగబడ్డారు. రెచ్చిపోయారు. అప్పుడే వారి మధ్య గొడవ జరిగింది. అప్పుడు ఆటో డ్రైవర్ డ్యాన్సర్లను ఆటోలో ఎక్కించుకుని హైదరాబాద్ బయలురేరిండు. క

కానీ తాగిన మత్తులో పర్వేజ్ అతని స్నేహితులు ఆటోను అటకాయించారు. ఆటో డ్రైవర్ మీద దాడి చేశారు. ఇదంతా రహదారిమీద జరుగుతున్న సమయంలో పహాడీషరీఫ్ పోలీసులు అటువైపు పెట్రోలింగ్ లో భాగంగా వచ్చారు. వీరి గొడవను చూశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పోలీసులను చూసి కొందరు పర్వేజ్ దోస్తులు పారిపోయారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తానికి బర్త్ డే వేడుకలు వెరైటీ గా చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అసలుకే మోసం వచ్చి కటకటాలు లెక్కబెట్టాల్సిన దుస్థితి వచ్చిపడింది.

loader