హైదరాబాద్: దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన దిశపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనలో  పోలీసులు ఓ వీడియోను  స్వాధీనం చేసుకొన్నారు.  దిశ హత్య కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఈ వీడియోను సేకరించారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో  నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.

Also read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: విచారణను వాయిదా వేసిన హైకోర్టు

గత నెల  27వ తేదీన శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద  దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్ కు పాల్పడి ఆమెను హత్య చేశారు.ఈ ఘటనపై నిందితులు ఎలా వెళ్లారు, ఎక్కడెక్కడికి వెళ్లారు, దిశను ఏ సమయంలో హత్య చేశారనే విషయాన్ని  సిట్ బృందం  విచారణ సమయంలో కీలకమైన సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  

Also read:నా భర్తను చంపిన వారిని వదలను: చెన్నకేశవులు భార్య

లారీలో దిశను తరలిస్తున్నవీడియోను పోలీసలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ వీడియోను  పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ నెల 6వ తేదీన సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో  నిందితులను చటాన్‌పల్లికి తీసుకొచ్చారు. చటాన్‌పల్లి వద్ద పోలీసులను తీసుకొచ్చారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేయడంతో  పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 12వ తేదీకి కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు  ఈ పిటిషన్‌పై విచారణ ఉన్నందున  కేసును హైకోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.