సీఎం కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపాటు వాస్తు పేరుతో ఇళ్లు నిర్మించడం లౌకికవాదానికి విరుద్ధం
ఒక వైపు నోట్ల రద్దుతో ప్రజలు ఇళ్లు గడవడం కష్టంగా ఉందంటూ వాపోతుంటే ప్రజాధనం దుర్వినియోగం చేసి సీఎం కేసీఆర్ కోట్ల రూపాయిలతో ఇళ్లు నిర్మించడం దారుణమని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు.
కొత్త క్యాంపు ఆఫీస్‌లోకి వెళ్లే లోపు పేదల డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంపై గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.
వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం సరికాదని ఇది లౌకికవాదానికి విరుద్ధమని పేర్కొన్నారు.
ముందు పేదల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడానికి నిరాకరిస్తున్న సీఎం.. తన కొత్త ఇంటి బాత్ రూం కు కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టడం సరికాదని విమర్శించారు.
