కేసిఆర్, హరీష్ రావులకు ఆ హక్కు ఎక్కడిది?

Shabbir Ali questions KCR and Harish rao
Highlights

సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్‌కు తరలించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి హరీష్‌రావులకు ఎవరిచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. 

జహీరాబాద్: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని శ్రీరాంసాగర్‌కు తరలించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి హరీష్‌రావులకు ఎవరిచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జహీరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలు ఆలస్యమైతే సింగూరు ఆయకట్టు కింద ఉన్న జిల్లాల రైతుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. రాష్ట్రంలో సునామీ రాబోతుందని, కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణ మాఫీ తప్పక చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో ఇఫ్తార్‌, క్రిస్మస్‌ వేడుకలను రద్దు చేసుకోవాలనే రాష్ట్రపతి నిర్ణయాన్ని షబ్బీర్‌ అలీ తప్పుపట్టారు. 

రాష్ట్రపతి నిర్ణయానికి నిరసనగా గవర్నర్‌ ఇచ్చే  ఇఫ్తార్‌ విందుకు తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.

loader