ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పెద్ద అబద్దాలకోరని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (shabbir ali) విమర్శించారు. దళితుడిని సీఎం (dalit cm) చేస్తాననే హామీని నెరవేర్చలేదని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారని మండిపడ్డారు. అయితే అందులో తన పేరును లాగడం దురదృష్టకరమని అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) పెద్ద అబద్దాలకోరని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (shabbir ali) విమర్శించారు. దళితుడిని సీఎం (dalit cm) చేస్తాననే హామీని నెరవేర్చలేదని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారని మండిపడ్డారు. అయితే అందులో తన పేరును లాగడం దురదృష్టకరమని అన్నారు. 2014లో దళిత ముఖ్యమంత్రి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నామో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

వివరాలు ప్రగతి భవన్‌లో జరిగిన మీడియాలో సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దళిత ముఖ్యమంత్రిని చేయలేదు కదా అంటారు.. నేను చేయలేదనేది వాస్తవం. దాని తర్వాత ఎన్నికలకు వెళ్లాం. మళ్లీ గెలిచినం. నేను చేస్తానని చెప్పినా.. చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి. మేమే కేసీఆర్‌ను చేయనివ్వలేదని షబ్బీర్ అలీ చెప్పిండు. అనేక కారణాల వల్ల అది చేయలేదనిది వాస్తవం. అయితే ప్రజలు నా నిర్ణయాన్ని ఆమోదించారు. మొదట 63తోటి గెలిస్తే.. తర్వాత 88తో గెలిచాం కదా..’అని అన్నారు. 

Also read: నా ఫాంహౌస్ లో అడుగుపెడితే ఆరు ముక్కలవుతావు: బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్

అయితే దళిత సీఎం విషయంలో తన పేరును ప్రస్తావించడంపై షబ్బీర్ అలీ స్పందించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన సలహాలు వింటున్నట్టుగా నటిస్తున్నారని.. మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే.. ఇప్పుడు తన సలహా మేరకు రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయండి అని కోరారు. ఈ మేరకు షబ్బీర్ అలీ ట్వీట్ చేశారు. 

Also read: కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే.. పెట్రోల్‌‌పై వ్యాట్ విధించింది మీరు కాదా?.. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

Scroll to load tweet…

‘కేసీఆర్ మహా అబద్ధాలకోరు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీని నెరవేర్చలేదని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారు. దురదృష్టవశాత్తు.. ఆయన నా పేరును ఇందులోకి లాగుతున్నారు. దళిత ముఖ్యమంత్రి విషయంపై 2014లో మనం ఎప్పుడు కలిశాం..? ఏం మాట్లాడుకున్నాం..? దయచేసి చెప్పండి. కేసీఆర్.. మీరు నా అనుచరుడిగా నటిస్తున్నారా..? అయితే నా సలహాలన్నీ వినండి. మీ వాదనలో నిజం ఉంటే.. ఇప్పుడు నా సలహా విని దళితుడిని సీఎం చేయడానికి రాజీనామా చేయండి. మీరు అబద్ధాలకోరు అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మీరు భ్రాంతికరమైన ప్రపంచంలో జీవిస్తున్నట్లున్నారు’ అని అన్నారు.