చాంద్రాయణగుట్ట భవానీనగర్ పరిధిలో నివసించే ఓ బాలుడు స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే స్కూలులో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్ధులు అతడిపై ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బాలుడిపై మరో ముగ్గురు బాలురు ఏడాదికాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట భవానీనగర్ పరిధిలో నివసించే ఓ బాలుడు స్థానిక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
అదే స్కూలులో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్ధులు అతడిపై ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు.. అంతేకాకుండా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తామని బెదిరించారు.
అయితే ఇటీవల బాధితుడి తండ్రి పాఠశాలకు రాగా.. అతను నీరసంగా కనిపించాడు. ఏమైందని ఆరా తీయగా బాలుడు అసలు విషయం చెప్పాడు. వెంటనే బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
