మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు. 

జిల్లాలోని దండేపల్లి మండలం కన్నెపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణీకులు బస్సు కింద పడిపోయారు.
బస్సు కింద పడిపోయిన ప్రయాణీకులను స్థానికులు, పోలీసులు రక్షించే ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు.

also read:కడప జిల్లాలో ఘోర ప్రమాదం: లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ప్రయాణీస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రెండు వాహనాలు ఢీకొన్న వెంటనే బోల్తా పడ్డాయి.
బస్సులోని ప్రయాణీకుల్లో చాలా మంది బస్సు కింద పడిపోయారు. బస్సును పైకి లేపి ప్రయాణీకులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఊట్నూరు డిపోకు చెందిన  టీఎస్ 01 జడ్ 0132 అనే నెంబర్ గల  ఆర్టీసీ బస్సు, ఇసుక లారీని  ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతి చెందారు. మరో  20 మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.కరీంనగర్ నుండి లక్సెట్టిపేట వైపుకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. చిట్యాల వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.