కేసీఆర్‌తో మూడు రాష్ట్రాల నేతల భేటీ: బీఆర్ఎస్ విధి విధానాలపై చర్చ
బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో మూడు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇవాళ సమావేశమయ్యారు. బీఆర్ఎస్ విధి విధానాల గురించి కేసీఆర్ తో చర్చించారు
హైదరాబాద్: బీఆర్ఎస్ చీప్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో మూడు రాష్ట్రాలకు చెందిన నేతలు శనివారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహరాష్ట్ర మాజీ ఎంపీ కుషాల్, ఛత్తీస్ ఘడ్ మాజీ ఎంపీ చబ్బీలాల్ లు శనివారం నాడు కేసీఆర్ తో సమావేశమయ్యారు.
తెలంగాణలో రైతు బంధు, ఉచిత విద్యుత్ , ఆసరా పెన్షన్లు వంటి పథకాలపై కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు నేతలు. రేపు మహరాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ బహిరంగ జరగనుంది. బీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మహరాష్ట్రలో ఈ సభను నిర్వహిస్తుంది ఆ పార్టీ నాయకత్వం. నాందేడ్ బహిరంగ సభను బీఆర్ఎస్ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు నాందేడ్ బహిరంగసభకు జనమీకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహరాష్ట్ర గ్రామాలకు చెందిన ప్రజలను ఈ సభకు తరలించనున్నారు. మరో వైపు నాందేడ్ కు సమీపంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చందిన ప్రజలను కూడా ఈ సభకు తరలించనున్నారు.