హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలో సర్వర్ ప్రాబ్లమ్... జారీకానీ టికెట్లు, ప్రయాణీకుల అవస్థలు
అసలే భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో మరిన్ని కష్టాలకు గురిచేస్తోంది. సర్వర్ ప్రాబ్లం తలెత్తడంతో మెట్రో స్టేషన్ లలో టికెట్లు జారీ కావడం లేదు.
హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో (hyderabad metro stations ) సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. ప్రయాణీకులకు టికెట్లు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎవరికీ టికెట్లు ఇష్యూ కావడం లేదు. అరగంట నుంచి సమస్య ఏర్పడటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో అధికారులు, సిబ్బంది నుంచి సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణీకులు ఎప్పుడు సమస్య కొలిక్కి వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన నగరంలో భారీ కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు.. నేడు, రేపు హైదరాబాద్ నగరానికి (hyderabad rains) భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు.
ALso Read:మహబూబాబాద్ జిల్లా: వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు... అందులో 16 మంది పిల్లలు
భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.