హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి సీటును  పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్  పార్టీ నేత భిక్షపతి యాదవ్  అనుచరులతో మంగళశారం నాడు సమావేశమయ్యారు.

గ్రేటర్ హైద్రాబాద్‌ పరిధిలోని శేరిలింగంపల్లి సీటు నుండి 2014లో టీడీపీ విజయం సాధించింది. ఈ స్థానం నుండి అరికెపూడి గాంధీ  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్‌ఎంసీ  ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో  చేరారు.

ఈ స్థానాన్ని టీడీపీకి ఈ దపా కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.ఈ స్థానం నుండి మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ (భవ్య ప్రసాద్)‌కు  టీడీపీ టికెట్టును కేటాయించింది.   అయితే ఈ స్థానాన్ని  టీడీపీకి ఇవ్వొద్దని  డిమాండ్ చేస్తూ 15 రోజుల క్రితం గాంధీ భవన్ ఎదుట  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్  ధర్నా నిర్వహించారు. ఆ రోజు భిక్షపతి యాదవ్‌ ఇద్దరు అనుచరులు  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అయితే  ఈ స్థానం పొత్తులో భాగంగా  టీడీపీకి కేటాయించడంతో  ఏం చేయాలనే దానిపై భిక్షపతి యాదవ్  తన అనుచరులతో  సమావేశమయ్యారు. ఇండిపెండెంట్‌గా భిక్షపతి యాదవ్ బరిలోకి దిగుతారా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది  ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

శేరిలింగంపల్లి టీడీపీలో లొల్లి: మెనిగళ్ల ప్రసాద్‌పై దాడికి కారణమిదే: మువ్వ

శేరిలింగంపల్లి లొల్లి: టీడీపీలో బాహాబాహీ, సైకిల్‌కు సీటొద్దంటున్న బిక్షపతి యాదవ్

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి