ఓ హత్య కేసుకు సంబంధించి విచారణ చేపట్టగా విచారణలో పోలీసులు భయపడేలా తన నేరాల చిట్టా విప్పాడు. దీంతో నిందితుడ నేరాల చిట్టాను చూసి పోలీసులు అవాక్కయ్యారు.విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి స్పష్టం చేశారు. 

మహబూబ్ నగర్: డబ్బుకోసం ఎంతకైనా తెగిస్తాడు. దోచుకుకోవడం కోసం చంపేందుకూ వెనుకాడడు. అడ్డువచ్చిన వారిని అడ్రస్ లేకుండా చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మందిని మట్టుబెట్టాడు ఆ దుర్మార్గుడు.

13 ఏళ్లుగా ఈ దారుణాలకు ఒడిగడుతున్న సీరియల్ కిల్లర్ ని మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చొక్కంపేటకు చెందిన ఎండీ యూసుఫ్‌ అలియాస్‌ మహ్మద్‌ పాషా దొంగ. ఇటీవలే ఓ హత్య కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

ఓ హత్య కేసుకు సంబంధించి విచారణ చేపట్టగా విచారణలో పోలీసులు భయపడేలా తన నేరాల చిట్టా విప్పాడు. దీంతో నిందితుడ నేరాల చిట్టాను చూసి పోలీసులు అవాక్కయ్యారు.విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి స్పష్టం చేశారు. 

ఫిబ్రవరినెలలో నవాబ్‌పేట మండలానికి చెందిన బాలరాజ్‌ను మహ్మద్‌ పాషా హత్య చేశాడు. పోలీసులు పాషాను అదుపులోకి తీసుకొని విచారించగా 2006 నుంచి ఇప్పటివరకు అతడు 12 మందిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. 

ఇటీవలే వికారాబాద్‌లో జరిగిన హత్య కేసుతో పాటు, షాద్‌నగర్‌లో బైక్‌ల దొంగతనం కేసుల్లో అరెస్ట్‌ అయ్యాడు మహ్మద్ పాషా. అయితే ఈ హత్యల విషయం బయటపడలేదు. అయితే మహబూబ్ నగర్ పోలీసులు తమదైన స్టైల్ లో విచారించేసరికి అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు పాషాను రిమాండ్ కు తరలించారు.