నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం : సీనియర్ల వేధింపులు.. పోలీసులకు జూనియర్ల ఫిర్యాదు, అరెస్ట్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ నేపథ్యంలో సీనియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సీనియర్లను తీసుకెళ్తుండగా వారిపై చెప్పులు విసిరారు జూనియర్లు .

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్లు తమను ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత వివరాల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు పలువురు సీనియర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సీనియర్లను తీసుకెళ్తుండగా వారిపై చెప్పులు విసిరారు జూనియర్లు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.