సీనియర్ జర్నలిస్ట్, రచయిత సాహిత్యకారుడు టంకశాల అశోక్ ప్రభుత్వ సలహాదారుగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణతో అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యవహరిస్తారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పలు దినపత్రికల్లో రిపోర్టర్‌గా, పత్రికా సంపాదకుడుగా తెలంగాణ భావజాల వ్యాప్తికి అశోక్ విశేషంగా కృషి చేశారు.