''సిస్టర్ ఫర్ ఛేంజ్" "గిఫ్ట్ ఏ హెల్మెట్": బ్రిటన్ మద్దతు, ర్యాలీ

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 23, Aug 2018, 11:23 AM IST
Sending across a message of safety
Highlights

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేపట్టిన  ''సిస్టర్ ఫర్ ఛేంజ్" "గిఫ్ట్ ఏ హెల్మెట్" కార్యక్రమానికి బ్రిటీష్ దౌత్యవేత్తలు తమ మద్దతు తెలిపారు

నిజామాబాద్:తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేపట్టిన  ''సిస్టర్ ఫర్ ఛేంజ్" "గిఫ్ట్ ఏ హెల్మెట్" కార్యక్రమానికి బ్రిటీష్ దౌత్యవేత్తలు తమ మద్దతు తెలిపారు. బుధవారం నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి యూత్  ర్యాలీ నిర్వహించింది.   ఈ ర్యాలీ నీ స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో 
బ్రిటిష్  దౌత్యవేత్తలు  ప్రారంభించారు. 

బ్రిటీష్ హై కమిషన్ తెలంగాణ, ఏపి రాష్ట్రాల డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, రాజకీయ మీడియా విభాగాధిపతి కిరణ్ డ్రేక్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్,లు జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించారు. 

తెలంగాణ జాగృతి మహిళా నాయకులు బ్రిటీష్ దౌత్యవేత్తలకు రాఖీలు కట్టారు. యువకులకు హెల్మెట్లు బహూకరించారు.
నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులపాటు బ్రిటిష్ దౌత్యవేత్తలు పర్యటిస్తున్నారు. ఈ ర్యాలీ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజి గౌడ్ లకు కూడా రాఖీ కట్టి హెల్మెట్లు బహుకరించారు.

హెల్మెట్ ప్రాణాలు రక్షిస్తుంది

హెల్మెట్ పెట్టుకోండి...అవి మీ ప్రాణాలను రక్షిస్తాయి..అని ద్విచక్ర వాహనదారులకు బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా విభాగం మినిస్టర్ కౌన్సిలర్ కీరన్ డ్రేక్ పిలుపునిచ్చారు.
హెల్మెట్ ను పెట్టుకుని బైక్ పై ప్రయాణించారు. 

ఎంపి కవిత చేపట్టిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ అవంతీ రావు, యూకే ఎన్నారై ప్రతినిధులు , జిల్లా నాయకులు నరాల సుధాకర్, లక్ష్మినారాయణ భరద్వాజ్, హరీష్, రమేష్, కొళ్ఢీప్,ఆనిష్, సంజీవ్,భాస్కర్, సందీప్, రాజేష్, అనిల్ దామోదర్, సాయి, గోపాల్, శ్రీను,విక్కీ,దామోదర్,మహేశ్,సతీష్ ,జగన్,అజయ్,ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు

హెల్మెట్ పెట్టుకోండి...అవి మీ ప్రాణాలను రక్షిస్తాయి..అని ద్విచక్ర వాహనదారులకు బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా విభాగం మినిస్టర్ కౌన్సిలర్ కీరన్ డ్రేక్ పిలుపునిచ్చారు.
హెల్మెట్ ను పెట్టుకుని బైక్ పై ప్రయాణించారు. ఎంపి కవిత చేపట్టిన సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు.

loader