ఈ యువకుడు సెల్ఫీ పిచ్చి ఎక్కువైంది. దీంతో వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి సెల్పీ తీసుకునే ప్రయత్నం చేశాడు. తుదకు రైలు గుద్దడంతో ఆసుపత్రి బెడ్ మీద చేరాడు. వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని భరత్ నగర్ రైల్వే ట్రాక్ పై శివ అనే యువకుడు ఎంఎంటిఎస్ రైలు వస్తుండగా మూడు రోజుల క్రితం సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. రైలు హారన్ కొడుతున్నా.. డేంజర్ గా నిలబడి అట్లనే సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు. ఇంతలో రైలు వేగంగా వచ్చి ఆ యువకుడిని ఢీకొట్టింది.

దీంతో శివను లింగపల్లి హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. తల కి చేతికి బలంగా గాయాలు అయ్యాయి. అతనికి ప్రాణపాయం ఏమీ లేదని రైల్వే ఎస్పీ అశోక్ మీడియాకు చెప్పారు. సెల్ఫీ సరదగా ఉండాలి.. కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.. తస్మాత్ జాగ్రత్త. సెల్పీ వీడియో తీసుకుంటుండగా.. రైలు ఢీకొట్టిన వీడియో కింద చూడొచ్చు.