సచివాలయంలో ఏ మంత్రి ఏ ఫ్లోర్.. ఏ గదిలో ఉన్నారంటే..

తెలంగాణలో కొత్త మంత్రులు సచివాలయంలో విధులు మొదలుపెట్టారు. వీరిని కలవాలంటే ఏ ఫ్లోర్ లో.. ఏ గదికి వెళ్లాలో తెలుసుకోండి.. 

See which minister in which floor and rooms in secretariat - bsb

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో కొత్త మంత్రులు కొలువు దీరారు. సచివాలయంలో వారు తమకు కేటాయించిన కార్యాలయాల్లో పనులు మొదలు పెట్టారు. నూతనంగా నిర్మించిన బీఆర్అంబేద్కర్ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వీరికి గదులు కేటాయిస్తూ ఆదివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ మంత్రులు ఎవరెవరు ఏ అంతస్తుల్లో... ఏ నెం. గదుల్లో ఉన్నారో వివరంగా చూడండి.

నెం. మంత్రి పేరు మంత్రిత్వ శాఖ ఏ అంతస్తు గది నెం.
1 భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ, ఇంధన శాఖ రెండవ  10, 11,  12
2. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్,  పౌర సరఫరాలు నాలుగవ 27, 28, 29
3 దామోదర రాజనర్సింహ వైద్యం,  కుటుంబ సంక్షేమం రెండవ 13, 14,15
4 కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ ఐదవ 10, 11,  12
5 శ్రీధర్ బాబు  ఐటి,  పరిశ్రమలు మూడవ   10, 11,  12
6 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ,  హౌసింగ్, సమాచార శాఖ గ్రౌండ్ ఫ్లోర్ 10, 11,  12
7 పొన్నం ప్రభాకర్ ట్రాన్స్ పోర్ట్, బీసీ సంక్షేమ శాఖ ఐదవ 27, 28, 29
8 కొండా సురేఖ అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ నాలుగవ 10, 11,  12
9 సీతక్క పిఆర్, ఆర్ డి, మహిళా శిశు సంక్షేమం మొదటి 27, 28, 29
10 తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, మార్కెటింగ్, కో-ఆపరేటివ్ మూడవ 27, 28, 29
11. జూపల్లి కృష్ణారావు  ఎక్సైజ్, టూరిజం  నాలుగవ 13,14,15

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios