తెలంగాణ ఫలితాలొస్తున్నాయ్

First Published 21, Nov 2017, 8:02 PM IST
See how the state of Telangana blossoming here
Highlights
  • అద్భుత ఫలితాలిస్తున్న పాలిహౌస్ లు
  • రంగారెడ్డిలో పర్యటించిన మంత్రులు పట్నం, పోచారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం ఫలిస్తున్నది. పాలి హౌస్ ల నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు తొలినాళ్లలో భారీగా రాయితీలిచ్చింది. దీంతో రైతులు కొందరు పాలిహౌస్ లను ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొద్ది మంది రైతులకే ఈ ప్రాజెక్టులను మంజూరు చేసి చాలా మందికి పెండింగ్ లో పెట్టినట్లు ఆరోపనలున్నాయి.. అది వేరే విషయం కానీ... అప్పుడు ప్రారంభమైన పాలిహౌస్ ల నుంచి ఫలాలు, ఫలితాలు అందుతున్నాయి. పాలి హౌస్ లలో పూలు విరగబూసినయ్.

చేవెళ్ల నియోజకవర్గం లో ని చన్ వెల్లిలో పాలీహౌజ్ రైతులకు 50 కోట్ల రాయితీ ఇచ్చింది అప్పట్లో సర్కారు. ఇప్పుడు అక్కడ పంటలు జోరుగా పండుతున్నాయి. మంగళవారం ఈ గ్రామంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ఏ యాదయ్య, ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కమీషనర్. టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతాంగం సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో  381 రైతుల పాలీహౌజ్ లకు 51 కోట్లు సబ్సిడీ లు అందించామన్నారు. పాలీహౌజ్ లలో పూలు, కూరగాయాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేలా ప్రోత్సాహం. అందిస్తున్నట్లు చెప్పారు.

ఆధునిక విజ్ఞానంతో పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చన్నారు. సెప్టెంబర్ నుండి పాలీహౌజ్ లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని వివరించారు. రైతుల ఆత్మ హత్యలు తగ్గించేందుకు రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రతీ రైతుకు ఎకరాకు 4 వేల పెట్టుబడులు రెండు పంటలకు అందిస్తుందన్నారు. రైతాంగం కోసం సీఎం కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారని చెప్పారు.

మంత్రి పోచారం మాట్లాడుతూ రైతులు అప్పుల ఊభి నుండి బయట పడాలని ఆకాంక్షించారు. రైతు కొడుకు రైతు కావాలని కోరుకునే రోజులు రావాలన్నారు. రైతులు పండించిన పంటలకు  కొనుగోలు కేంద్రాలు , మద్దతు ధరలు అందిస్తున్నామన్నారు. దిగుబడులు పెంచేలా రైతాంగానికి అవగాహన పెంచుతామని పోచారం పేర్కొన్నారు.

loader