అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం.. కాన్వాయ్ కి అడ్డువచ్చిన కారు...

అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భద్రతా లోపం ఏర్పడింది. ఆయన కాన్వాయ్ కి ఓ గుర్తు తెలియని కారు అడ్డుగా వచ్చింది. 

Security breach reported during Amit Shah's visit in Hyderabad

హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. హైదరాబాదులో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన అమిత్ షా కాన్వాయ్ కి గుర్తుతెలియని ఒక కారు అడ్డు వచ్చింది. కారు వెంటనే పక్కకు తీయకపోవడంతో అమిత్ షా సెక్యూరిటీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టారు. ఈ సంఘటన హరిత ప్లాజా సమీపంలో చోటు చేసుకుంది. 

అయితే కేంద్ర మంత్రి కాన్వాయ్ కి అడ్డం పెట్టిన ఈ కారు ఎవరిదో, ఎందుకు అలా జరిగింది? అనే విషయం పై భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా హైదరాబాద్ ను భారతదేశంలో చేర్చడంతో పాటు.. నిజాం పాలన నుండి ప్రజలను విముక్తి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.  ఆయన్ని స్మరించుకుంటూ భారతమాతకు నివాళులు అర్పించారు అమిత్ షా. 

తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా.. ఆ విషయంలో నేతలకు క్లాస్..?

కాగా, నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రజాకార్లు అనేక గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు అని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషివల్ల నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజల విముక్తి పొందారని అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 

ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కర్ణాటక రవాణా శాఖ మంత్రి బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… హైదరాబాద్ స్వతంత్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జలియన్ వాలా బాగ్ ఘటన జరిగిందని అన్నారు. సర్దార్ పటేల్ చొరవతో పోలీసులు చర్యలు తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి సాధ్యమైందని తెలిపారు. ఆనాడు 109 గంటలపాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందన్నారు. పటేల్ లేకుంటే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేది అని అన్నారు.

స్వార్దం కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారు.. సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతోంది: సీఎం కేసీఆర్

తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని తెలిపారు.  విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్నిపార్టీలు భయపడ్డాయి అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలను జరపలేదని విమర్శించారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios