సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: కేసు నమోదు చేసిన పోలీసులు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట  డెక్కన్  నైట్ వేర్ దుకాణంలో  అగ్ని ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  

Secunderabad Ramgopalpet Fire accident: Police Files Case AGainst Deccan nightwear store incident

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్  స్టోర్ లో  జరిగిన అగ్ని ప్రమాదంపై  రాంగోపాల్ పేట పోలీసులు  కేసు నమోదు చేశారు.గురువారం నాడు ఉదయం నుండి రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్  స్టోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు.  నిబంధనలకు విరుద్దంగా  ఈ భవనంలో మెటీరియల్ ను  నిల్వ ఉంచాలని  అధికారులు అభిప్రాయపడుతున్నారు. జనావాసాల మధ్య  ఇలాంటి మెటీరియల్  ను నిల్వ ఉంచడం వల్ల  ప్రమాదానికి కారణంగా మారిందనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.ఈ భవనానికి  ఫైర్ సేఫ్టీ కూడా సరిగా లేదని కూడా అధికారులు గుర్తించారు  

ఈ భవనంలో  ఉన్న  వారిని గుర్తించి  రక్షించారు.  ఇప్పటివరకు  పోలీసుల కథనం ప్రకారంగా  నలుగురిని రక్షించినట్టుగా చెబుతున్నారు.  ఈ భవనంలోని మరో ఇద్దరు చిక్కుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనంలో ఎవరైనా ఉన్నారా అనే విషయమై  చూసేందుకు  అధికారులు చేసిన ఫ్రయత్నాలు పలించలేదు.  భవనం చుట్టూ అగ్నిమాపక బృందాలు  మంటలను ఆర్పేందుకు  ప్రయత్నాలు  చేస్తున్నాయి.

ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనానికి కూడా మంటలు వ్యాపించాయి.  డెక్కన్ నైట్ వేర్ స్టోర్ ఉన్న  భవనం అన్ని అంతస్థుల్లో మంటలు  పూర్తిగా  వ్యాపించాయి.  ఐదారు గంటలుగా  మంటలతో  ఉండడంతో భవనం పూర్తిగా  దెబ్బతింది.  ఈ భవనంలోని రెండు అంతస్థుల స్లాబ్ కుప్పకూలింది.  మిగిలిన అంతస్థలు స్లాబ్ కూడా  కూలిపోయే  అవకాశం ఉందని  అనుమానిస్తున్నారు.

also read:మంటలు అందుకే అదుపు కాలేదు: రాంగోపాల్ పేట అగ్నిప్రమాదంపై డీఆర్ఎఫ్ చీఫ్ విశ్వజిత్

ఈ భవనంలో  సింథటిక్  మెటీరియల్ ఉన్న కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్టుగా  అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మంటలను అదుపు చేసేందుకు  పలు శాఖల అధికారులు సమన్వయంతో  పనిచేస్తున్నారు. సంఘటనస్థలాన్ని ఇవాళ మధ్యాహ్నం  తలసాని శ్రీనివాస్ యాదవ్  సందర్శించారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర హోంశాఖ  మంత్రి మహమూద్ అలీ  సందర్శించారుసహాయక చర్యలను మంత్రులు పరిశీలించారు.  ఇతర  భవనాలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో   


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios