మంటలు అందుకే అదుపు కాలేదు: రాంగోపాల్ పేట అగ్నిప్రమాదంపై డీఆర్ఎఫ్ చీఫ్ విశ్వజిత్
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలను ఆర్పేందుకు సమయం పట్టే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ అధికారి విశ్వజిత్ అభిప్రాయపడ్డారు. మంటల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు.
హైదరాబాద్: అగ్ని ప్రమాదం జరిగిన భవనం విషయంలో అవసరమైతే కీలక నిర్ణయం తీసుకుంటామని జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ చీఫ్ విశ్వజిత్ చెప్పారు.మంటలను ఆర్పే విషయమై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా డిఆర్ఎఫ్ చీఫ్ తెలిపారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నందున భవనం వద్దకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని విశ్వజిత్ చెబుతున్నారు, ఈ కారణంగానే మంటలను ఆర్పడం ఆలస్యమౌతుందన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు గాను చర్యలు చేపట్టామన్నారు. ఈ భవనం చుట్టుపక్కలన నివాసాలను ఖాళీ చేయించినట్టుగా ఆయన వివరించారు.ప్రాణ నష్టం కాకుండా ఉండాలనేది తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
also read:సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: కాచీబౌలి కాలనీవాసుల తరలింపు
డెక్కన్ నైట్ వేర్ స్టోర్ దుకాణంలో గురువారంనాడు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో అగ్నికి ఆహుతయ్యే మెటీరియల్ ఉన్న కారణంగా మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందాయి. సింథటిక్ మెటీరీయల్ , కార్ల డేకరేషన్ కు ఉపయోగించే మెటీరియల్ ఉంది. దీంతో మంటలు వేగంగా వ్యాపించినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు గాను కెమికల్ ను కూడా ఉపయోగించారు. ఈ భవనానికి మూడు వైపులా ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ , పోలీస్ శాఖలు ఇతర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.