తప్పిన ప్రమాదం: కూలిన డెక్కన్ మాల్ ఆరు అంతస్తులు
డెక్కన్ మాల్ కూల్చివేత సమయంలో ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది.
హైదరాబాద్: డెక్కన్ మాల్ కూల్చివేత సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. డెక్కన్ మాల్ కూల్చివేస్తున్న సమయంలో ఆరు అంతస్స్లాథులుబ్ మంగళశారంనాడు కుప్పకూలింది. డెక్కన్ మాల్ కూల్చివేతను పురస్కరించుకొని చుట్టుపక్కల వారిని తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో డెక్కన్ మాల్ భవనం పూర్తిగా దెబ్బతింది.ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ భవనం కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లను పిలిచారు. ఈ నెల 25వ తేదీన హైద్రాబాద్ కు చెందిన సంస్థ ఈ భవనం కూల్చివేత పనులను దక్కించుకుంది. ఈ భవనం కూల్చివేత సమయంలో చుట్టుపక్కల భవనాలు దెబ్బతినకుండా కూల్చివేయాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు షరతులు విధించారు.
ఈ నెల 26వ తేదీ నుండి డెక్కన్ మాల్ కూల్చివేత పనులను టెండర్ దక్కించుకున్న సంస్థ ప్రారంభించింది. చుట్టు పక్కల భవనాలు దెబ్బతినకుండా డెక్కన్ మాల్ ను కూల్చివేసే పనులను ప్రారంభించారు. ఇవాళ భవనం ఆరు అంతస్థులు కుప్పకూలిపోయాయి. ఈ ఆరు అంతస్థుల భవనం కుప్పకూలే సమయంలో భారీగా దుమ్ము వచ్చింది. ఆరు అంతస్థుల భవనం కుప్పకూలడంతో ఇతర భవనాలకు దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ భవనంలో అధికారులు తనిఖీలు చేసిన సమయంలో ఓ ఆస్తిపంజరం లభ్యమైంది. ఈ ఆస్థి పంజరం ఎవరిదనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.