Asianet News TeluguAsianet News Telugu

రాంగోపాల్ పేట అగ్ని ప్రమాదం: ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థత, భవనం కూల్చివేసే చాన్స్

సికింద్రాబాద్  రాంగోపాల్ పేట  డెక్కన్  నైట్ వేర్  స్టోర్  భవనాన్ని  ఇవాళో లేదో  రేపో  కూల్చివేయనున్నారు. ఈ భవనంలోని  సెల్లార్  లో మంటలు చెలరేగాయి. మంటలనుఆర్పే ప్రయత్నం చేసిన ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

Secunderabad Ram gopal pet fire accident: officials planning to demolition deccan night wear store
Author
First Published Jan 20, 2023, 9:38 AM IST

హైదరాబాద్: సికింద్రాబాద్   రాంగోపాల్ పేట డెక్కన్  నైట్ వేర్  స్టోర్   భవనాన్ని ఇవాళ లేదా  రేపు కూల్చివేసే అవకాశం ఉంది. ఈ భవనంలో  మంటలను నిన్న రాత్రి  8 గంటల సమయంలో  అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే  ఇవాళ ఉదయం నుండి భవనం సెల్లార్ లో  మంటలు మళ్లీ చెలరేగాయి. ఈ  మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.  జేఎన్‌టీయూ  ఇంజనీరింగ్ విభాగం  అధికారులు  ఇవాళ  ఉదయం  ఈ భవనాన్ని పరిశీలించనున్నారు. ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం మేరకు  ఈ   భవనాన్ని ఇవాళ లేదా రేపు  కూల్చివేయనున్నారు.  ఈ భవనంలోనికి ఎవరిని అనుమతించడం లేదు. 

ఈ భవన యజమాని  మహ్మద్, రహీంలపై పోలీసులు నిన్ననే కేసు నమోదుచేశారు.  రెసిడెన్షియల్  విభాగాన్ని కమర్షియల్ గా ఉపయోగిస్తున్నట్టుగా  అధికారులు గుర్తించారు.  అంతేకాదు  ఈ భవనం ఫైర్ నిబంధనలకు విరుద్దంగా  ఉందని అధికారులు గుర్తించారు. భవనంలో  మంటలకు అంటుకొనే  గుణం ఉన్న సింథటిక్, టైర్లు వంటి ఉండడం కూడా  మంటల తీవ్రత అధికంగా ఉండడానికి కారణంగా మారిందని అధికారులు  అభిప్రాయపడుతున్నారు.

also read:రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం : 40 ఫైరింజన్లు, గంటల పాటు శ్రమ.. ఎట్టకేలకు అదుపులోకి మంటలు

ప్రమాదం జరిగిన  భవనాన్ని తెలంగాణ మంత్రులు  మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు  పరిశీలించారు.  సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ భవనంలో  ఇంకా ముగురి ఆచూకీ తెలియడం లేదని భవన  యజమాని  తెలిపినట్టుగా  పోలీసులు  చెబుతున్నారు. అయితే  ఈ భవనం లోపలికి  వెళ్లి పరిశీలిస్తే  కానీ  అదృశ్యమైన వారి వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.  గంటల పాటు  మంటల్లో ఉన్నందున  ఈ భవనం  పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో  ఈ భవనం కుప్పకూలిపోయే అవకాశం ఉందని  అధికారులు అనుమానిస్తున్నారు.దీంతో ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ఇద్దరు ఫైర్ సిబ్బందికి అస్వస్థత

ఈ భవనంలోని సెల్లార్ లో  మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న  ఫైర్ సిబ్బందిలో  ఇవాళ మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏడీఎఫ్  ధనుంజయ్ రెడ్డి, ఫైర్ ఇంజన్ డ్రైవర్ లు అస్వస్థతకు గురయ్యారు. వీరిద్దరిని  ఆసుపత్రికి తరలించారు. నిన్న ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు  ప్రయత్నించిన  ఘటనలో  ముగ్గురు అస్వస్థతకు గురైన విసయం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios