Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

సికింద్రాబాద్‌పై పట్టు సాధిస్తే.. హైదరాబాద్‌ను గెలిచినట్లేనని రాజకీయ వర్గాల్లో వున్న పేరు. లష్కర్ అని సికింద్రాబాద్‌ను ముద్ధుగా పిలుచుకుంటారు.  బీసీలు, మైనారిటీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్రా సెటిలర్లు , రైల్వే ఉద్యోగులు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ప్రఖ్యాత రైల్వే జంక్షన్, ఆర్మీ రీజినల్ సెంటర్ వంటివి సికింద్రాబాద్ కేంద్రంగా వున్నాయి. పేరుకే సికింద్రాబాద్ కానీ.. ఈ పార్లమెంట్ పరిధిలోనివన్నీ హైదరాబాద్ జిల్లా స్థానాలే. అహ్మద్ మొహినుద్దీన్, పీ శివశంకర్, టంగుటూరి అంజయ్య, టీ మనెమ్మ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి ఉద్ధండులైన నేతలను పార్లమెంట్‌కు పంపిన చరిత్ర సికింద్రాబాద్‌ది. బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గులాబీ జెండా ఇక్కడ ఎగరలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీకి చెందిన వారే కావడంతో ఈసారి మాత్రం ఇక్కడ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

secunderabad lok sabha elections result 2024 ksp
Author
First Published Mar 14, 2024, 6:48 PM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్‌సభ సెగ్మెంట్లలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రత్యేకమైంది. జంట నగరాల్లో ఒకటిగా వున్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి దేశ చరిత్రలో విశిష్ట స్థానముంది. భిన్నమైన రాజకీయ పరిస్ధితులు ఇక్కడ వుంటాయి. ప్రఖ్యాత రైల్వే జంక్షన్, ఆర్మీ రీజినల్ సెంటర్ వంటివి సికింద్రాబాద్ కేంద్రంగా వున్నాయి. పేరుకే సికింద్రాబాద్ కానీ.. ఈ పార్లమెంట్ పరిధిలోనివన్నీ హైదరాబాద్ జిల్లా స్థానాలే.

సికింద్రాబాద్‌పై పట్టు సాధిస్తే.. హైదరాబాద్‌ను గెలిచినట్లేనని రాజకీయ వర్గాల్లో వున్న పేరు. లష్కర్ అని సికింద్రాబాద్‌ను ముద్ధుగా పిలుచుకుంటారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ సెగ్మెంట్ కాంగ్రెస్‌కు కంచుకోట. తర్వాత బీజేపీకి అడ్డాగా మారింది. తెలంగాణలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా వుందా అంటే సికింద్రాబాదే. బీసీలు, మైనారిటీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్రా సెటిలర్లు , రైల్వే ఉద్యోగులు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. 

సికింద్రాబాద్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. తొలుత కాంగ్రెస్, తర్వాత బీజేపీ :

అహ్మద్ మొహినుద్దీన్, పీ శివశంకర్, టంగుటూరి అంజయ్య, టీ మనెమ్మ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వంటి ఉద్ధండులైన నేతలను పార్లమెంట్‌కు పంపిన చరిత్ర సికింద్రాబాద్‌ది. కాంగ్రెస్ పార్టీ 12 సార్లు, బీజేపీ 5 సార్లు విజయం సాధించింది. భార్యభర్తలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టంగుటూరి అంజయ్య, ఆయన సతీమణి మనెమ్మలు ఇక్కడి నుంచి ఎంపీలుగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 19,68,276 మంది.. వీరిలో పురుషులు 9,43,189 మంది.. మహిళా ఓటర్ల సంఖ్య 10,25,028 మంది. 

సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 .. బలంగా బీఆర్ఎస్ :

2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ 3,22,666 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్‌కి 1,73,229 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 62,114 ఓట్ల మెజారిటీతో సికింద్రాబాద్‌ను కైవసం చేసుకుంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాల్ అసెంబ్లీ స్థానాలున్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ 6 చోట్ల, ఎంఐఎం ఒకచోట విజయం సాధించాయి. 

తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఒకప్పటి తన కంచుకోటను తిరిగి సంపాదించాలనే పట్టుదలతో వుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ దాని మిత్రపక్షం ఎంఐఎం , బీజేపీలు బలంగా వున్నప్పటికీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్‌ నుంచి పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు విద్యా స్రవంతి, ఎంఆర్‌సీ వినోద్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావులు కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 

సికింద్రాబాద్ ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీజేపీ :

బీఆర్ఎస్ విషయానికి వస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు గులాబీ జెండా ఇక్కడ ఎగరలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014, 2019లలో బీఆర్ఎస్ గాలి తెలంగాణ వ్యాప్తంగా వీచినప్పటికీ .. సికింద్రాబాద్‌లో మాత్రం కేసీఆర్ పాచికలు పారలేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా గులాబీ పార్టీకి చెందిన వారే కావడంతో ఈసారి మాత్రం ఇక్కడ పాగా వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. సికింద్రాబాద్ బరిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్  పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని పట్టుదలతో వుంది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది. మోడీ చరిష్మా, బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తాను మరోసారి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios