Asianet News TeluguAsianet News Telugu

అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో సోమవారం నాడు కూడ చుక్కెదురైంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

Secunderabad court denies AP former minister Bhuma Akhila Priya bail plea lns
Author
Hyderabad, First Published Jan 18, 2021, 2:47 PM IST

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో సోమవారం నాడు కూడ చుక్కెదురైంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.అఖిలప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసి మెమో దాఖలు చేశారు హైద్రాబాద్ పోలీసులు. 

 

జీవిత కాలం శిక్షపడే కేసలు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు రిటర్న్ చేసింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని అఖిలప్రియ న్యాయవాదులకు కోర్టు సూచించిందిదీంతో నాంపల్లి కోర్టు అఖిలప్రియ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనుంది. 

ఈ నెల 5వ తేదీన బోయిన్‌పల్లికి చెందిన ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులు కిడ్నాపయ్యారు.ఈ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ కుటుంబం, గుంటూరు శ్రీనులు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.

ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా 9 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్ తదితరులు చిక్కితే  ఇంకా కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గతంలో కూడ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అఖిలప్రియకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు చెప్పారు. దీంతో గతంలో కూడ ఆమెకు బెయిలివ్వలేదు.

దీంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అఖిలప్రియ న్యాయవాది. సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. 

అఖిలప్రియ కుటుంబానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉందని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది వాదించారు.ఆమెకు బెయిలిస్తే  సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మరోసారి కోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది విన్పించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios