సికింద్రాబాద్ బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. తన భర్తపై కేసు పెట్టేందుకు వచ్చిన భార్య, అత్త మామ, బంధువులపై కత్తితో దాడి చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు ఎదురుగానే భర్త కొబ్బరి బొండాలు కత్తితో స్టేషన్లోకి చొరబడి భార్య, అత్తమామలపై కత్తితో దాడి చేయడం గమనార్హం.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. తన భర్తపై కేసు పెట్టేందుకు వచ్చిన భార్య, అత్త మామ, బంధువులపై కత్తితో దాడి చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు ఎదురుగానే భర్త కొబ్బరి బొండాలు కత్తితో స్టేషన్లోకి చొరబడి భార్య, అత్తమామలపై కత్తితో దాడి చేయడం గమనార్హం.
నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో మహిళా పోలీసులు భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ అంతా రక్తమయం అయ్యింది. తీవ్ర గాయాలపాలైన ఐదుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. అయితే బాధితులు గత కొద్ది రోజులుగా బేగంపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి వెళ్తున్నారని సమాచారం. కుటుంబ కలహాలతో భార్య భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు పిలిచారని అయితే తనపై కేసు పెడుతుందన్న భయంతో భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.
అయితే నిందితుడి రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిలో భార్యషకీరా బేగం ఆమె కుటుంబ సభ్యులు షేక్ సల్మాన్, షాహిన్ బేగం, కౌసర్ బి, మస్తాన్ బేగంలుగా పోలీసులు గుర్తించారు. రెహమాన్ పై ఫిర్యాదు చేసేందుకు షకీరా బేగం పోలీస్ స్టేషన్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది.
విషయం తెలుసుకున్న రెహమాన్ కొబ్బరిబొండాల కత్తితో పోలీస్ స్టేషన్‌లో చొరబడి విచక్షణారహితంగా వారిపై దాడి చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రెహమాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
