Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : ఖరారైన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన .. షెడ్యూల్ ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. తాజాగా ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్.. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో పాల్గొంటారు. 
 

schedule for PM Narendra Modi Campaign for Telangana assembly elections 2023 ksp
Author
First Published Nov 21, 2023, 10:15 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ప్రచారం చేశారు. తాజాగా ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు నవంబర్ 26న తూప్రాన్, నిర్మల్.. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ప్రధాని రోడ్ షోలో పాల్గొననున్నారు. 

ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు ఈ ఎన్నికల్లో నిర్ణయింబడుతుందనీ, అవినీతి బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. అధికార బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. 

జోగులాంబ ఆలయ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ. 70 కోట్లు అందిస్తే.. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. తాము బీసీ వ్యక్తిని సీఎంని చేసి తీరుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కంటే బీజేపీ నే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.  

Also Read: ఒక్క హామీయైనా నెరవేర్చారా .. రెండు సార్లు అధికారంలోకి : కేసీఆర్ పాలనపై పురందేశ్వరి విమర్శలు

గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి అమిత్ షా. అలాగే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్న ప్రజలు నమ్మించి మోసం చేశారనీ, ఆ హామీని ఎందుకు నేరవేర్చలేదని ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే  తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గద్వాలలో చేనేత కార్మికుల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు ఏర్పాటు చేస్తామనీ, పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు..

కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలోనే ఉందని అమిత్ షా కీలక వ్యాఖ్యాలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌, మజ్లిస్‌ లను 2జీ,3జీ,4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. ఈ పార్టీలన్నీ పోవాలని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో యువత జీవితాలతో ఆడుకుందని,  బీజేపీకి అధికారమిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కేంద్రమంత్రి అమిత్ షా. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించబడుతుందని అన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios