Telangana Polls 2023 : ఊహాగానాలకు తెర.. జనసేన అభ్యర్ధుల తరపున పవన్ ఎన్నికల ప్రచారం , షెడ్యూల్ ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన పార్టీ నిలిచిన సంగతి తెలిసిందే. విమర్శలకు చెక్ పెడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ షెడ్యూల్ ప్రకటిస్తూ ప్రకటన చేసింది. 

schedule for janasena chief Pawan Kalyan Campaign for Telangana assembly elections 2023 ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన పార్టీ నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తులో వున్న నేపథ్యంలో 8 చోట్ల జనసేన అభ్యర్ధులు పోటీ చేసేందుకు కమలనాథులు ఓకే చెప్పారు. అయితే ఇంత వరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. జనసేన తరపున ప్రచారం చేసింది లేదు. దీంతో ఆయన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీతో కలిసి వేదికను పంచుకున్న సభలోనూ ఆయన బీజేపీ, జనసేన అభ్యర్ధులకు ఓటేయ్యాలని చెప్పకుండా కేవలం మోడీని పొగడ్తల్లో ముంచెత్తడమే సరిపోయింది. 

ఈ విమర్శలకు చెక్ పెడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ షెడ్యూల్ ప్రకటిస్తూ ప్రకటన చేసింది. ఈ నెల 22, 23 తేదీలలో పవన్ కల్యాణ్ వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలలో జనసేన అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. మిగిలిన చోట్ల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని జనసేన పార్టీ వెల్లడించింది. 

 

 

జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన  ఎనిమిది మంది జనసేన పార్టీ అభ్యర్థులకు ఇటీవల బీఫామ్ లు అందించారు. జనసేన పార్టీ ఆవిర్భవించి.. దశాబ్దకాలం గడుస్తున్న ఇప్పటి వరకూ ప్రత్యేక్షంగా ఎన్నికల బరిలో నిలువలేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు నిలిచే తప్ప బరిలో దిగాలేదు. తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగి జనసేన తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ బాధల్నీ, ఆకాంక్షల్ని అర్థం చేసుకున్నవాడిగా రాష్ట్ర అభివృద్ధి సాధనకు తాను కట్టుబడి ఉందని తెలిపారు. తాను ఎప్పుడు తెలంగాణ పోరాటాలకు అండగా ఉండేవాడిననీ, తెలంగాణ స్ఫూర్తిగా తెలంగాణ పోరాడుతూ.. ఆ పోరాట స్ఫూర్తితోనే తాను జనసేన పార్టీని స్థాపించి, ముందుకు నడుస్తున్నానని  అన్నారు. హోమ్ రూల్ పాటించాలనే ఆలోచనతోనే దశాబ్ద కాలంగా తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. 

పార్టీ ఆవిర్భవించి దశాబ్ద కాలం అనంతరం నేడు మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి ఎనిమిది మంది అభ్యర్థులతో ఎన్నికల బరిలో నిలిచామని పవన్ తెలిపారు. నాలుగు కోట్ల మంది ప్రజలు వచ్చి సకల జనులు సమ్మె చేస్తే సాధించుకున్న తెలంగాణలో యువత ఆకాంక్షలు నేరవేరాలని ఆయన కోరుకున్నారు. ఇరురాష్ట్రాల ప్రగతి కోసం తాను పాటు పడుతాననీ,  ఆంధ్ర అభివృద్ధి సాధిస్తేనే ఆంధ్ర వలసలు ఆగుతాయనీ, లేకపోతే.. తెలంగాణ సాధించుకున్న విశిష్టత మూల కారణం కూడా నిష్ప్రయోజనం అవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు.

బరిలో నిలిచిన జనసైనికులు వీరే.. 

కూకట్‌పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios