ప్రగతి భవన్ కు మారిన సీన్: కేసిఆర్ తో మంత్రులు, అధికారులు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 5, Sep 2018, 5:05 PM IST
Scene changes to Pragathi Bhavan
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ముందస్తు ఎన్నికల సీన్ ప్రగతి భవన్ కు మారింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ నుంచి తన నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ముందస్తు ఎన్నికల సీన్ ప్రగతి భవన్ కు మారింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ నుంచి తన నివాసం ప్రగతి భవన్ కు చేరుకున్నారు. 

ఆయనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు. ముందస్తు ఎన్నికల కోసం కేసిఆర్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన తన ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. శాసనసభ్యులతో ఫోన్ లో మాట్లాడారు.

ప్రగతి భవన్ లో కేసిఆర్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ అయ్యారు. కాసేపట్లో రేపటి మంత్రి వర్గ సమావేశం సమయాన్ని ఆయన ప్రకటించే అవకాశం ఉంది. 

కొన్ని ముఖ్యమైన పాలనాపరమైన నిర్ణయాలను కూడా కేసిఆర్ ఈ రోజు తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. 

ఈ వార్తలు చదవండి

తెలంగాణ ముందస్తు ఎన్నికలపై ఈసీ సిఈవో స్పందన ఇది

ముందస్తు ఎన్నికలు: ఫైళ్లతో మంత్రుల కుస్తీ.. ఉరుకులు, పరుగులు

ఫామ్ హౌస్ లో కేసిఆర్ భేటీ: ఎమ్మెల్యేలకు ఫోన్లు

loader