ఫామ్ హౌస్ లో కేసిఆర్ భేటీ: ఎమ్మెల్యేలకు ఫోన్లు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 5, Sep 2018, 1:13 PM IST
KCR meets TRS leaders at Farm House
Highlights

తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల కసరత్తును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రారంభించారు. తన ఫామ్ హోస్ నుంచే ఆయన వ్యూహరచన చేస్తున్నారు. బుధవారంనాడు ఆయన ఫామ్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల కసరత్తును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రారంభించారు. తన ఫామ్ హోస్ నుంచే ఆయన వ్యూహరచన చేస్తున్నారు. బుధవారంనాడు ఆయన ఫామ్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. 

ఎన్నికల వ్యూహాలు, ప్రచార షెడ్యూల్ పై ఆయన మంతనాలు జరుపుతున్నారు. ఫామ్ హౌస్ నుంచే ఆయన శాసనసభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన హుస్నాబాద్ లో జరిగే బహిరంగ సభపై కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. 

హుస్నాబాద్ సభలోనే ఆయన తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు గురువారం ఉదయం మంత్రి వర్గ సమావేశంలో శాసనసభ రద్దకు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. 

మంత్రివర్గ నిర్ణయం తర్వాత మంత్రులతో కలిసి ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి రద్దు ప్రతిపాదనకు సంబంధించిన లేఖను అందజేస్తారని సమాచారం. ఈ స్థితిలో పెండింగు ఫైళ్ల క్లియరెన్స్ పై మంత్రులు దృష్టి సారించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏమైనా ఉంటే ఈ రెండు రోజుల్లో పూర్తి చేయాలని మంత్రులు శాసనసభ్యులకు సూచించారు .

loader