సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం రాయరం  గ్రామంలో అత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని  ఎస్సి  ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా  
ఆయన  మాట్లాడుతూ  రాయవరంలో చోటుచేసుకున్న ఘటన అత్యంత హేయమైన చర్య అని బాధ్యులు  ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 ఇలాంటటి ఘటన జరగడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని బాధిత బాలిక ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని అలాగే ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు .

ప్రభుత్వపరంగా కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆయన సూచించారు .ప్రభుత్వపరంగా మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు .ఈ కార్యక్రమంలో. గజ్వేల్  ఆర్డీవో విజయేందర్ రెడ్డి ,ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి చరణ్ గజ్వేల్ ఏసిపి నారాయణ  రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్ శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.