Asianet News TeluguAsianet News Telugu

చీరెలు చోరీ చేసి ‘తెలంగాణ’కు చివాట్లు పెట్టించాడు

ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు  చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

SC questioned Ts for detaining sari thief under law meant for dacoits

టైం బాగా లేకపోతే అంతే.... ఎంత సర్కారైనా సరైన రూట్ లో వెళ్లకపోతే యాక్సిడెంట్  అవడం గ్యారెంటీ.

పోలీసులు చేసిన చిన్న పొరపాటుకు తెలంగాణ ప్రభుత్వం పై కోర్టు మొట్టికాయలు వేసినంత పనిచేసింది.  

 

వివరాల్లోకి వెళ్తే...

 

చీరెల దొంగిలించిన కారణంగా సీహెచ్ ఎల్లయ్య అనే వ్యక్తిని  ఏపీ పీడీ యాక్ట్-1986 ప్రకారం గతంలో పోలీసులు  అరెస్టు చేశారు.

 

ఎల్లయ్య ఒక్కసారి కాదు మూడు సార్లు  చీరెలే టార్గెట్ గా దొంగతనాలు మొదలు పెట్టాడు. అందుకే పోలీసులు చివరకు పీడీ యాక్ట్ కింద ఆయనను అరెస్టు చేశారు.

 

అయితే ఎల్లయ్య తనపై పెట్టిన కేసుపై  హైకోర్టు కు వెళ్లాడు. అయితే పోలీసుల చర్యను హై కోర్టు సమర్థించింది. దీంతో పట్టువదలని ఎల్లయ్య తన భార్య సాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

 

ఎల్లయ్య పేరు మీదుగా ఒక్క కేసులోనూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదనీ, చోరీకి పాల్పడ్డడని చెప్పేందుకు సాక్షులేవరూ లేరని సుప్రీంకోర్టు గుర్తించింది.

 

చీరలు చోరీ చేసిన వ్యక్తిని బంధిపోటుగా చిత్రీకరిస్తూ పీడీ యాక్ట్ కింద ఏలా అరెస్టు చేస్తారని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

 

ఐదు చీరలు చోరీ చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ ప్రయోగించడంపై చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ అశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios