Asianet News TeluguAsianet News Telugu

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

MLC Kavitha: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాస్త ఊరట లభించింది.  ఆమె దాఖాలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై కవిత దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. 

SC extends protection to BRS MLC Kavitha from ED action KRJ
Author
First Published Feb 29, 2024, 4:21 AM IST | Last Updated Feb 29, 2024, 4:21 AM IST

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కాస్త ఉపశమనం లభించింది.  ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇచ్చిన నోటీసులను సవాల్ చేసింది. ఈ క్రమంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 13వ తేదీన వాయిదా వేసింది. నిజానికి.. ఈ పిటిషన్‌పై విచారణ బుధవారమే జరగాల్సింది. కానీ, కోర్టు సమయం ముగియడంతో వాయిదా వేశారు. దీంతో.. త్వరగా విచారణ జరపాలని కవిత తరఫున న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) ప్రత్యేకంగా ప్రస్తావించారు. మార్చి 13వ తేదీన తప్పకుండా విచారిస్తామని.. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది.

ఎమ్మెల్సీ కవిత  తనకు జారీ చేసిన సమన్లను తప్పించుకుంటున్నారని అంతకుముందు జరిగిన విచారణలో ఆర్థిక దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆమె సమన్లను తప్పించుకుంటుంది. ఆమె హాజరుకావడం లేదని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు జస్టిస్ త్రివేది నేతృత్వంలోని ధర్మాసనానికి నివేదించారు.

కవితకు మధ్యంతర ఉపశమనం కోసం, ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న విచారణలో ఆమె హాజరు కావాలని పట్టుబట్టవద్దని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు EDని కోరింది. BRS నాయకురాలు కవిత తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మహిళల్ని దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలని, అలాగే తనపై ఈడీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేయగా.. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు గత విచారణలో ధర్మాసనం స్పష్టం చేసింది
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios