శాయంపేట రూరల్ సీఐ మానవత్వం.. నడవలేని వృద్ధురాలిని ఎత్తుకుని

నడవలేని వృద్ధురాలిమీద శాయంపేట రూరల్ సీఐ రమేష్ కుమార్ మానవత్వం చూపించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎం సందర్శన సందర్బంగా ఆస్పత్రి వద్ద బందోబస్తులో ఉన్నారు రమేష్ కుమార్. 

Sayanpet Rural CI Ramesh Kumar Humanity Towards Old Woman - bsb

నడవలేని వృద్ధురాలిమీద శాయంపేట రూరల్ సీఐ రమేష్ కుమార్ మానవత్వం చూపించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంజీఎం సందర్శన సందర్బంగా ఆస్పత్రి వద్ద బందోబస్తులో ఉన్నారు రమేష్ కుమార్. 

ఈ సమయంలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో అవస్త పడుతూ కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్లి అడగగా.. తాను నడవలేని స్థితిలో ఉన్నట్టు తెలిపింది. అక్కడికి దగ్గర్లో ఏ వాహనమూ లేదు. సీఎం పర్యటన  కారణంగా వచ్చే అవకాశం కూడా లేదు. 

దీంతో సీఐ రమేష్ కుమార్ సాహసం చేశారు. కరోనాని కూడా లెక్కచేయకుండా ఆ వృద్దురాలిని తన చేతులతో ఎత్తుకొని ఆటోలు వున్నా స్థలానికి ఎత్తుకుని తీసుకుపోయాడు.

ఓ ఆటోలో ఎక్కిచి చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు. ఆ సంఘటనను చూసిన పరకాల ఏసీపీ శ్రీనివాస్, మిగతా పోలీస్ సిబ్బంది సీఐ చేసిన పనికి హర్షం వ్యక్తం చేశారు. 

గాయపడిన జంటను కాపాడిన పోలీసులకు రాచకొండ సీపీ ప్రశంసలు.....

కాగా, గురువారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన జంటను ఆసుపత్రికి తరలించిన భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పెట్రోల్ మొబైల్ టీంను రాచకొండ సిపి ప్రశంసించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. 

బుధవారం నాడు సాయంత్రం 6.45 నిమిషాలకు  భోంగిర్ భువనగిరి రూరల్ పోలీసు పెట్రోలింగ్ మొబైల్ బృందం రాయిగిరి సమీపంలో వాహన తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో యదగిరిగుట్ట రోడ్డులో ప్రమాదం జరిగిందని కొంతమంది పోలీసులకు తెలిపారు.

యదగిరిగుట్ట రోడ్డులోని మల్లనా ఆలయం సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగిందని.. దీనికి బాధ్యులెవరూ కాదని, వారే ప్రమాదవశాత్తు బండి స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని భువనగిరి ఆసుపత్రిలో చేర్పించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios