డ్రైవర్‌తో సౌదీ వ్యాపారవేత్త కూతురు పెళ్ళి: ప్రియుడి కోసం కామారెడ్డికి

saudi girl married car driver in Kamareddy
Highlights

కారు డ్రైవర్ ను పెళ్ళి చేసుకొన్న సౌదీ వ్యాపారవేత్త కూతురు

హైదరాబాద్:ప్రేమకు కుల, మతాలు, ఆస్తులు, అంతస్థులు అడ్డుకావని సౌదీకి చెందిన ఓ యువతి నిరూపించింది. సౌదీలో ఓ వ్యాపారవేత్త కూతురు కారు డ్రైవర్‌ను ఇండియాకు వచ్చి వివాహం చేసుకొంది. పెళ్ళి చేసుకొనేవరకు కుటుంబసభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడింది,. పెళ్ళి చేసుకొన్న తర్వాత ఆమె తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. 


కామారెడ్డి జిల్లాకు చెందిన అజీబుద్దీన్ అనే యువకుడు  ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్ళాడు. అక్కడ వ్యాపారి నసీర్ ఇబ్రహీం అనే వ్యక్తి వద్ద కారు డ్రైవర్ గా పనిచేశాడు. ఆ సమయంలోనసీర్ ఇబ్రహీం కూతురు అజీబుద్దీన్ తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అజీబుద్దీన్ కు చెప్పింది. సౌదీలో వివాహం చేసుకొంటే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆమె భావించింది. 

దీంతో ప్రియుడైన అజీబుద్దీన్ కు  ప్లాన్ చెప్పింది. స్వదేశానికి వెళ్ళిపోవాలని అజీబుద్దీన్ కు సూచించింది. ఆ తర్వాత స్నేహితులను కలుసుకొంటానని చెప్పి ఆమె నేపాల్ మీదుగా
ఇండియాకు వచ్చింది.

ప్రియురాలు సూచన మేరకు అజీబుద్దీన్ ఈ ఏడాది జనవరి మాసంలో కామారెడ్డికి తిరిగి వచ్చేశాడు. 
స్నేహితులను కలుసుకొనే పేరుతో ఈ  ఏడాది మే మాసంలో అజీబుద్దీన్ ప్రియురాలుఇండియాకు వచ్చింది. 

ఇండియాకు వచ్చినట్టు అజీబుద్దీన్ కు ఆమె సమాచారాన్ని ఇచ్చింది. అతడు ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు. మే రెండో వారంలో వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. వివాహం చేసుకొన్నవిషయాన్ని ఆమె తన తండ్రికి ఫోన్ లో వివరించింది. 

రెండు రోజల క్రితం హైద్రాబాద్ కు వచ్చిన నసీర్ ఇబ్రహీం సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అజీబుద్దీన్ తనను బలవంతంగా తీసుకురాలేదని అతడిని వివాహంచేసుకొనేందుకే కామారెడ్డికి తానే వచ్చినట్టుగా ఆమె చెప్పారు. దీంతో పోలీసులు కూడ ఏం చేయలేకపోయారు. 

loader