కేసిఆర్ గొప్ప భక్తులు.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు.. సత్యవతి రాథోడ్ (వీడియో)

ముఖ్యమంత్రి KCR స్వయంగా గొప్ప భక్తులు, హిందువులమని చెప్పుకునే వారికి మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా తెలియజేసిన సిఎం గారు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు అన్నారు.

satyavathi rathod comments on kcr

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ఈ రాష్ట్రానికి సిఎంగా ఉన్న కేసిఆర్ గొప్ప భక్తులని మాటల్లో కాకుండా చేతల్లో హిందువునని తెలియజేశారని..ఆయన కష్టానికి తగిన ఫలితం కూడా భగవంతుడు ఇస్తున్నారని మంత్రి satyavathi rathod కొనియాడారు. 

"

ముఖ్యమంత్రి KCR స్వయంగా గొప్ప భక్తులు, హిందువులమని చెప్పుకునే వారికి మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా తెలియజేసిన సిఎం గారు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గండ్ర దంపతులు వెంకటరమణారెడ్డి, జ్యోతిలు  నిర్వహించిన నవాహ్నిక చండీ మహా క్రతువులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. పూజలు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... సిఎం కేసిఆర్ స్వయంగా గొప్ప భక్తులు, హిందువులమని చెప్పుకునే వారికి మాటల్లో కాకుండా చేతల్లో తన భక్తిని చూపించారు ముఖ్యమంత్రి.  అధికారం రాకముందు, వచ్చిన తర్వాత కూడా అనేక యాగాలు, హోమాలు చేశారు. రాష్ట్ర ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించారు. 

తెలంగాణ సంప్రదాయ పండగలను కూడా గౌరవంగా నిర్వహించుకునే విధంగా చేశారు. అందుకే వారి కష్టానికి భగవంతుడు కూడా ఫలితాన్ని ఇస్తున్నారు. వర్షాలు సమృద్దిగా కురిసి, ప్రజలు అందరూ రెండు పంటలు పండించుకుని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

చైర్ పర్సన్ Gandra Jyoti గారు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉండడం విశేషం. ఒక వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉండడం అరుదు అని కొనియాడారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చేస్తున్న ఈ క్రతువుకు భగవంతుడు ఆశీర్వదించి, ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసేవిధంగా వీరికి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య... ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్

అంతకు ముందు.. గతనెలలో గులాబ్ తుఫాన్ కారణంగా వరుస వర్షాల వల్ల తెగిన కరెంట్ వైర్ తగలడంతో షాక్ కొట్టి మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమరి దీక్షిత (16) చనిపోయింది. ఆమె కుటుంబాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్  నేడు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. 

దీక్షిత ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మృతికి  విద్యుత్ శాఖ నుంచి 5 లక్షల రూపాయల నష్ట పరిహారం, అమ్మాయి తల్లి అంగన్వాడి టీచర్ కావడంతో ప్రత్యేకంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి లక్ష రూపాయల సాయం అందించారు. 

అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, అదనపు కలెక్టర్ కొమురయ్య, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios