అమ్మా, నాన్న మిస్ యూ: వేధింపులను సూసైడ్ లేఖలో ప్రస్తావించిన సాత్విక్

 కాలేజీలో  లెక్చరర్ల వేధింపులు తట్టుకోలేక  ఆత్మహత్యకు  పాల్పడుతున్నట్టుగా  సాత్విక్  సూసైడ్ లేఖలో  పేర్కొన్నారు. 

Satwik Suicide letter reveals harassment in Sri Chaitanya College

హైదరాబాద్:  వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య  చేసుకొంటున్నట్టుగా   సాత్విక్   చెప్పారు.ఆత్మహత్య  చేసుకొనే ముందు  సాత్విక్  సూసైడ్  లేఖ రాశారు.  తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు  తనను క్షమించాలని  సాత్విక్ ఆ లేఖలో  పేర్కొన్నారు.  కృష్ణారెడ్డి , ఆచార్య , శోభన్, నరేష్ తనను వేధింపులకు గురి చేశారని ఆ లేఖలో  సాత్విక్ పేర్కొన్నారు.  మిమ్మల్ని  బాధ పెట్టాలనే  ఉద్దేశ్యం తనకు  లేదని  సాత్విక్  ఆ లేఖలో వివరించారు. తనతో పాటు  కాలేజీకి చెందిన విద్యార్ధులను వేధింపులకు గురి చేసినట్టుగా   సాత్విక్ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఆత్మహత్య  చేసుకున్నందుకు గాను   తనను క్షమించాలని  ఆ లేఖలో  కోరింది.సాత్విక్  సూసైడ్ లేఖ  బుధవారం నాడు సాయంత్రం వెలుగు చూసింది. సాత్విక్ పోస్టుమర్టం పూర్తైన తర్వాత  ఈ లేఖ  బయటకు  వచ్చింది. 

నిన్న రాత్రి  నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ పస్టియర్ స్టూడెండ్  సాత్విక్ ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు కారణమైన  వారిపై  చర్యలు తీసుకోవాలని పేరేంట్స్,  విద్యార్ధి సంఘాలు ఇవాళ  ఆందోళనకు దిగారు.  

గతంలో కూడా సాత్విక్ పై కాలేజీ లెక్చరర్లు  కొడితే  15 రోజులు ఇంటి వద్దే ఉన్నాడని పేరేంట్స్ మీడియాకు  చెప్పారు. సాత్విక్ ను కొట్టవద్దని  లెక్చరర్లకు  చెప్పినా పట్టించుకోలేదన్నారు.  పరీక్షలు పూర్తి కాగానే సాత్విక్ ను  వేరే కాలేజీకి మార్చాలని  తాము నిర్ణయించుకున్నామని  సాత్విక్ తండ్రి  చెబుతున్నారు. 

also read:సాత్విక్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్ట్‌మార్టం పూర్తి.. భారీ భద్రత మధ్య స్వగ్రామానికి

సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి  రెండు గంటల ముందే  తండ్రి   కాలేజీ క్యాంపస్ వద్దకు  వచ్చాడు.సాత్విక్ అవసరమైన మందులను కూడా తీసుకువచ్చాడు. ఈ మందులు తీసుకున్న సాత్విక్  తండ్రితో మాట్లాడారు. తండ్రి ఫోన్ తో తల్లి, సోదరుడితో కూడా  మాట్లాడారు.  సాత్విక్ తండ్రి  ఇంటికి  చేరుకున్న  అరగంటకే  సాత్విక్ కు సీరియస్ గా ఉందని అతని స్నేహితులు  ఫోన్ లో సమాచారం ఇచ్చారు.   ఈ విషయమై  కాలేజీ యాజమాన్యం  నుండి ఎలాంటి సమాచారం లేదని  సాత్విక్  పేరేంట్స్  ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు.సాత్విక్ ఆత్మహత్య  ఘటనపై  పోలీసులు కేసు నమోదు  చేశారు.   
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios