గ్రేటర్ హైదరాబాద్ ప్లెక్సీలో సర్వే కు చోటు లేదు గాంధీభవన్ ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గాంధీభవన్ వర్గాల్లో హాట్ టాపిక్

గాంధీభవన్ సాక్షిగా మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణకు అవమానం జరిగింది.

సోనియా గాంధీ పుట్టినరోజు, రాహుల్ గాంధీ పట్టాభిషేకం సందర్భంగా గాంధీభవన్ లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులు.

ఈ ఫెక్సీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు చాలా పెద్దగా పెట్టారు.

పిసిసి చీఫ్ ఉత్తమ్ ఫొటో కూడా పెద్దగానే పెట్టారు.

అయితే ఇక జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న రాష్ట్ర నేతలందరి ఫొటోలు ఉంచారు.

అందులో సర్వే సత్యనారాయణ ఫొటో మాత్రం లేదు.

ఇది కావాలని చేశారా? లేక పొరపాటున చేశారా అన్నది చర్చనీయాంశమైంది. 

దీనిపై గాంధీభవన్ వర్గాల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

ఈ ఫ్లెక్సీ తాలూకూ వీడియో కింద చూడండి.