సంగారెడ్డి జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాను ఓడిఎఫ్ రహితంగా ప్రకటించేందుకు వెళ్లిన మంత్రులను సర్పంచ్‌లు అడ్డుకున్నారు.

ఉప సర్పంచ్‌లతో ఉమ్మడి చెక్‌పవర్‌ను తొలగించాలంటూ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టారు. మంత్రులు వారికి నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని.. కొందరు సర్పంచ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో వారు తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితి చోటు చేసుకుంది.