Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్‌: కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటా.. వైరలవుతున్న సర్పంచ్ వీడియో

రేపు హుజురాబాద్‌లో జరగనున్న కెసిఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సర్పంచ్ వీడియో పోస్ట్ కలకలం రేపుతోంది. అతనిని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ సర్పంచ్ మహేందర్ గౌడ్‌గా గుర్తించారు. బిల్లులు నిలిపివేయడంపైనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

sarpanch selfie video viral in karimnagar district
Author
Huzurabad, First Published Aug 15, 2021, 7:21 PM IST

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ సర్పంచ్ మహేందర్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు రావలసిన బిల్లులపై ఉపసర్పంచ్  గుజ్జ జయసుధ సంతకం పెట్టడం లేదని.. అలాగే అధికారులు ,డీపీవో వీరబుచ్చయ్య సహకరించటం లేదంటూ ఆరోపించారు. ఈ క్రమంలో రేపు హుజురాబాద్‌లో జరగనున్న కెసిఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానని ఓ వీడియో తీసి సోషల్ మీడియా పెట్టాడు.  కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన మహేందర్ గౌడ్ ప్రస్తుతం బిజేపి పార్టీలో ఉన్నాడు తాను బిజేపి పార్టీలో ఉన్నందున కావాలని ఇబ్బందులకి గురి చేస్తున్నారని వీడియో వాపోయాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో మహేందర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు... ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొవడంతో మహేందర్ ఎక్కడ ఉన్నాడని అరా తీస్తున్నారు

 

"

Follow Us:
Download App:
  • android
  • ios