Asianet News TeluguAsianet News Telugu

సరూర్‌నగర్ పరువు హత్య కేసు.. ఫైండ్ మై డివైస్ ఆధారంగానే నాగరాజు లోకేషన్..

సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల ఐదు రోజుల కస్టడీ ముగిసింది. నాగరాజును హత్య చేసిన నిందితులు మొబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌లను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు.. కీలక సమాచారం సేకరించారు. 

Saroornagar honour killing Accused use find my device to track nagaraju location
Author
Hyderabad, First Published May 17, 2022, 2:57 PM IST

సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితుల ఐదు రోజుల కస్టడీ ముగిసింది. నాగరాజును హత్య చేసిన నిందితులు మొబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌లను ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు.. కీలక సమాచారం సేకరించారు. నాగారాజు హత్య కేసులో మోబిన్, మసూద్ ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందని.. మూడో వ్యక్తి ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. తన చెల్లిని నాగరాజు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే మొబిన్, తన బావ మసూద్‌తో కలిసి ఈ హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది. 

నిందితుల విచారణలో భాగంగా పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుల కాల్ డేటాను సేకరించిన పోలీసులు.. ఘటన జరిగిన రోజు వారు కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే మాట్లాడినట్టుగా నిర్దారించారు. నాగరాజు జీమెయిల్ ఐడీ తెలిసిన మొబిన్.. దాని పాస్‌వర్డ్ తెలుసకునే ప్రయత్నం చేశాడు. నాగరాజు మెయిల్ పాస్‌వర్డ్ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చని ప్రయత్నం చేశాడు. అయితే నాగరాజు మొబైల్ నెంబర్‌నే పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడంతో.. మొబిన్  చాలా సులువుగా మెయిల్‌ యాక్సిస్ పొందాడు. తర్వాత నాగరాజును హత్య చేయాలని చూసిన నిందితులు.. జీమెయిల్ ద్వారా ఫైండ్ మై డివైస్‌లోకి వెళ్లి అతని కదలికలను తెలుసుకున్నారు. ఇక, పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 4వ తేదీన నాగారాజును నిందితులు హత్య చేశారు. 

మరోవైపు నిందితులకు ముస్లిం సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కొందరి ఆరోపణలను పోలీసులు ఖండించారు. నిందితులకు ఏ సంస్థతో సంబంధాలు లేవని కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపర్చారు. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios