హైదరాబాద్: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్ గా నియమించింది. సంతోషిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఇప్పుడు ఆమెకు ట్రైనీ కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది. 

సంతోషి డిప్యూటీ కలెక్టర్ గా శిక్షణ కూడా తీసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ గా ఆమె శిక్షణ తీసుకున్నారు. గత జూన్ నెలలో లఢక్ లోని గల్వాన్ లోయలో చైనా, భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన విషయం తెిలసిందే. 

Also Read: కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి...బంజారాహిల్స్ లో రూ.20కోట్ల ఇంటిస్థలం

సంతోష్ బాబు మరణంతో ప్రభుత్వం ఆయన భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఆమెను ప్రస్తుతం ప్రభుత్వం యాదాద్రి జిల్లాకు కేటాయించింది. ఆమె ఈ రోజు సోమవారం విధుల్లో చేరుతారు.

కాగా, హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా ప్రభుత్వం సంతోషి కి రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని అప్పగించింది. సంతోషి కుటుంబానికి నగదు కూడా అందజేశారు.

Also Read: కల్నల్ సంతోష్ బాబు భార్యను సత్కరించిన ఆర్మీ