పాలమూరు అంతర్జాతీయ పోటీలకు వేదికగా మారింది. సంక్రాంతిని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ లో అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్ , పారా మోటార్ చాంపియన్ షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నాడు ప్రారంభించారు.
మహబూబ్‌నగర్: పాలమూరు అంతర్జాతీయ పోటీలకు వేదికగా మారింది. సంక్రాంతిని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ లో అంతర్జాతీయ ఏరో స్పోర్ట్స్ , పారా మోటార్ చాంపియన్ షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నాడు ప్రారంభించారు.
పది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పోటీపడుతున్న ఈ ఉత్సవాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. వరల్డ్ అడ్వెంచర్స్, ఎయిర్ స్పోర్ట్స్ ఎయిర్ షో ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్, స్కై డైవింగ్, పారా మోటార్ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆకాశంలో మోటార్ పైలెట్ల విన్యాసాలు అబ్బురపరిచాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్ షో, పారామోటార్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
హర్యానా, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందినవారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
ఆరు టాస్క్‌లలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.. గతేడాది గాలిపటాల ఉత్సవాలను నిర్వహించగా ఈసారి అంతర్జాతీయ స్థాయిలో పోటీలు తలపెట్టారు.దేశంలోనే తొలి ఏరో స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
